27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆరోటౌన్ పరిధిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

Must read

📰 Generate e-Paper Clip

  • 26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లు సీజ్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరంపూరి హిల్స్ నందు మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ నివసిస్తున్న అనుమానితుల ఇండ్లను, రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు, నంబర్ ప్లేట్లు, వితౌట్ నెంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలను, 42 మోటార్ సైకిల్ లను సీజ్ చేశారు. అనంతరం ధర్మపురి హిల్స్ కాలనీవాసులను ఉద్దేశించి నిజామాబాద్ టౌన్ ఏసిపి ఎల్ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ని వాడాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ల ఏరియాలో తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Police cordon search in Arrowtown area

రాత్రిపూట రోడ్లమీద అనవసరంగా తిరుగు వద్దని, ఎవరైనా పేకాట గాని, మట్క గాని ఆడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఎవరైనా గంజాయి అమ్మిన వాళ్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గమనిస్తూ ఎలాంటి దురాలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చదువు మీద దృష్టి సారించాలని కోరారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో నిజామాబాద్ సబ్ డివిజన్ కి సంబంధించిన సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, వన్ టౌన్ సిఐ రఘుపతి  ,వన్ టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాసరాజు , నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్  విమెన్ పి ఎస్ సీఐ శ్రీలత,  డిచ్పల్లి సిఐ మల్లేష్, ధర్పల్లి సిఐ బిక్షపతి, నిజాంబాద్ సబ్ డివిజన్ కి చెందిన 13 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Police cordon search in Arrowtown area

More articles

Latest article