24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

. . . పోస్టర్ లను విడుధల చేసిన సిపీ డిటీసీ

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:, 

నిజామాబాద్ లో జాతీయ రోడ్డు రోడ్డు భద్రత మాసోత్సవాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో  అవగాహన కరపత్రాలు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ,జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ జి.దుర్గా ప్రమీల  లు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రహదారుల పై ప్రయాణించాలి అని తెలిపారు . ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డి. సి. పి (ఎ.ఆర్) రామచంద్ర రావు , జే. ఉమామహేశ్వరరావు , జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు  బి. శ్రీనివాస్ ,కిరణ్ కుమార్, నాగలక్ష్మి ,అజయ్ కుమార్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ , ట్రాఫిక్ ఏ.సి.పి మస్తాన్ వలీ, నిజామాబాద్ ,బోధన్, ఆర్మూర్, ఏ సీ.పిల తో పాటు ట్రాఫిక్ సి.ఐ పి.ప్రసాద్. రెడ్ క్రాస్ విభాగం వారు, ఈ దార్ జిల్లా ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article