నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 6వ టౌన్ ఎస్ హెచ్ వో సందీప్ తెలిపారు. 6వ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సందీప్ మాట్లాడుతూ జన్నేపల్లి రైల్వేగేట్ వద్ద గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారి వద్ద నాలుగు కిలోల గంజాయి లభించిందని తెలిపారు. నాందేడ్ కు చెందిన ఆకుల్ వార్ రాజేంధర్, సద్దాంల వద్ద నాలుగు కిలోల గంజాయి దొరికిందని తె లిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని శంషాద్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నిజామాబాద్ లో విక్రయించేందుకు వస్తుండగా పట్టుబడినట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి కారు, నాలుగు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందన్నారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో పోలీస్ స్టేషన్ 2వ ఎస్సై నారాయణ సింగ్ , సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
