గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 6వ టౌన్ ఎస్ హెచ్ వో సందీప్ తెలిపారు. 6వ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సందీప్ మాట్లాడుతూ జన్నేపల్లి రైల్వేగేట్ వద్ద గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారి వద్ద నాలుగు కిలోల గంజాయి లభించిందని తెలిపారు. నాందేడ్ కు చెందిన ఆకుల్ వార్...