25.4 C
Hyderabad

సీఎంఆర్ఎఫ్ మెడికల్ రీయెంబర్స్ మెంట్ కోసం లక్ష లంచం

One-lakh bribe for CMRF medical reimbursement

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం

. . . లంచం తీసుకుంటూ డాటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్ పట్టివేత

వెబ్ డెస్క్, బతుకమ్మ :

తెలంగాణ సెక్రటేరియట్ లో  సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రీయెంబర్స్ మెంట్ కోసం లంచం తీసుకుంటూ ఉద్యోగులు అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. మంగళవారం సీటీ రేంజ్ 2 ఏసీబీ రేంజ్ అధికారులు సెక్రటేరియట్ లో దాడులు నిర్వహించారు. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ సచివాలయం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అందేశీ రాఘవేంధర్, టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ లను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోని ముఖ్యమంత్రి సహాయనిధి సెక్షన్ లో డాటా ఎంట్రీ  ఆపరేటర్ గా పని చేస్తున్న అందేశీ రాఘవేంధర్ బాధితుడికి సంబంధించిన రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. స్థానిక టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ ఆదేశాల మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

More articles

Latest article