27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జింకను చంపిన ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జింక కొమ్ములు… కత్తులు, బరిసేలు, వలలు స్వాధీనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం రిజర్వ్ పారేస్టులో జింకను వేటాడి చంపిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ హెచ్ ఓ చింతల తాడెం శ్రీనివాస్ తెలిపారు. గురువారం రూరల్ పిఎస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ… ఈ నెల 2న సాయంత్రం సమయంలో ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం మల్లారం శివారులో గల గుట్టలలో బోర్గాం గ్రామానికి చెందిన వ్యక్తులు గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ అనే వ్యక్తులు వారం రోజుల కిందట మల్లారం గుట్ట ప్రాంతంలో అటవీ జంతువు అయినా జింకను వలవేసి పట్టుకుని దాన్ని చంపినారని తెలిసింది. అట్టి వ్యక్తులను గురువారం ఉదయం పట్టుకుని వారిని విచారించగా గత వారం రోజుల కిందట జింకను వేటాడి చంపి నారు అని ఒప్పుకోవడం జరిగింది.  వెంకటి, విజయ్ , భూమయ్య ల దగ్గర నుంచి జింకను వేటాడి చంపడానికి ఉపయోగించిన ఇనుప సుత్తి, ఇనుప సత్తుర్, ఇనుప బరిస, 2 చాకులు ,ఇనుప ఉరి వల లను వారి దగ్గర నుండి స్వాధీన పరుచుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా జింక యొక్క కొమ్ములను కూడా స్వాధీన పరుచుకోవడం జరిగింది. అనిల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు  మిగతా వారిని కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ ను విధించడం జరిగిందని తెలిపారు.

More articles

Latest article