నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముద్దాయి షేక్ అహ్మద్ కు మూడు సంవత్సరాలు కఠిన జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతీష్ నగర్ కు చెందిన దేవరె సాయినాథ్ కూలి పనులు చేసుకుని జీవించేవాడు.7 జులై 2024 న అర్సపల్లి ఎక్స్ రోడ్ లో ఉన్న ఎమ్ఎస్ఆర్ బార్ లోకి వెళ్లి మద్యం తాగుతుండగా అతని పక్కన షేక్ అహ్మద్ కూడా మద్యం సేవిస్తున్నారు.తనకు మద్యం పోయాలని అహ్మద్ సాయినాథ్ ను అడిగాడు. నీకు నాకు పరిచయం లేదు నేను తాగే మద్యం నేనెందుకు పోయాలని అనటంతో అహ్మద్ గొడవకు దిగాడు. ఏదో మద్యం తాగుదామని వస్తే ఇక్కడ లొల్లి అయ్యేట్లు ఉన్నదని బావించిన సాయినాథ్ బార్ నుంచి ఇంటికి వెళదామని బయటకు వచ్చి రోడ్డుపై ఆటో కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో బార్ నుంచి బయటకు వచ్చిన అహ్మద్ సాయినాథ్ ను చంపివేయాలని ఉద్దేశంతో తన దగ్గర ఉన్న చాకుతో కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరచడమే నేర అభియోగాలు కోర్టు నేర విచారణ రుజువు కావడంతో భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 109(హత్యయత్నం ) నేరంగానే మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ పదమూడు పేజీ ల తీర్పు వెలువరించారు. జరిమానా కట్టని యెడల అదనంగా రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.
