. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :
మానవ ప్రాణం విలువైనదని, ప్రతి సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదని, సహాయం కోసం డయల్ 100 వాడాలని అని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడి ‘ఖాకీ’ గౌరవాన్ని చాటిచెప్పిన సిబ్బందిని ఎస్పీ శనివారం అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాన్సువాడ బ్లూకోల్ట్స్ ఉరి వేసుకున్న వ్యక్తిని, రాజంపేట పోలీసులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని, సదాశివనగర్ సిబ్బంది అర్ధరాత్రి చెరువు వద్ద ప్రాణాలు తీసుకోవాలనుకున్న వ్యక్తిని కాపాడారని తెలిపారు. అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణా, దొంగతనాల నియంత్రణలో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అనంతరం అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి నగదు బహుమతులు అందజేశారు.

