24 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిని సోమవారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. సాలూర మండలం శివారులోని పంట పొలాలలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్స్, ఎస్ఐపీ గోవింద్, స్పెషల్ పార్టీ సిబ్బంది దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో 8మందిని అరెస్ట్ చేసినట్లు  తెలిపారు. వారి వద్ద నుంచి 9సెల్ ఫోన్లు, రూ.1,01,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.

More articles

Latest article