ఆరోగ్య వారోత్సవాల ముగింపులో పాల్గొన్న పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలతో...