26.2 C
Hyderabad

ఘనంగా పోచమ్మ బోనాల పండగ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు

 

ఇందల్వాయి, బతుకమ్మ

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో పోచమ్మ పండగ సందర్భంగా బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే అమ్మవారికి ఆనవాయితీగా బోనాలతో నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వనభోజనాలకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ బోనాల పండగను విజయవంతం చేశారు.

More articles

Latest article