28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పీఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్‌ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ ఆభరణాల సంస్థ పీఎంజే జ్యువెల్స్ నూతన షోరూంను నగరంలోని హైదరాబాద్ రోడ్డులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పీఎంజే జ్యువెల్స్ నిజామాబాద్ స్టోర్స్ హెడ్ వడ్నాల కమల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ఈ చిరస్మరణీయ కార్యక్రమం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ.., “నిజామాబాద్‌లోకి పీఎంజే జ్యువెల్స్ విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యత, చేతిపనుల పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని పొగిడారు.  ఈ కొత్త స్టోర్ నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రజలకు అధ్భుతమైన ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని, ఈ ఆసక్తిని మరింత పెంచుతుందని తెలిపారు. మహేశ్వరం మధన్ కుమార్, వడ్నాల కమల్ మాట్లాడుతూ  పీఎంజే జ్యువెల్స్ ప్రసిద్ధి చెందిన రిటైల్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగతీకరించిన ఆతిథ్యాన్ని అనుభవించడానికి తాము ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నామన్నారు. నిజామాబాద్‌లోని పీఎంజే జ్యువెల్స్ కొత్త స్టోర్  సైతం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఘనమైన వారసత్వాన్ని ప్రతిధ్వనిస్తుందని అన్నారు. దక్షిణ భారతదేశంతో పాటు యూఎస్ఏ అంతటా విస్తరించి ఉన్న స్టోర్‌ల వృద్ధిలో ఈ నూతన చేరిక దూకుడుగా ముందుకు సాగుతున్న ఈ బ్రాండ్ యొక్క విస్తరణ ప్రణాళికలనుప్రతిబింబిస్తుందని తెలిపారు.

PMJ Jewels New Store Opening

More articles

Latest article