డిచ్పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరిక్షల ఫీ తేదీ ప్రకటన విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ పీ ఈ, ఐపిసిహెచ్) ఐదవ, ఏడవ,తొమ్మిదవ- సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు( థియరీ మరియు ప్రాక్టికల్) ఐఎంబిఏ, ఎల్ఎల్బి, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్) డిసెంబర్ 2024 లో జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్ష ల ఫీ అపరాధ రుసుము లేకుండా నవంబర్ 28వరకు, 100 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 02 వరకు చెల్లించాలని తెలిపారు. ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ( ఏపీ ఈ ) అన్ని సబ్జెక్టులకు రూ.500, ఐ ఎం బి ఏ ఐదవ సెమిస్టర్ అన్ని సబ్జెక్టులకు రూ.800 చెల్లించాలని తెలిపారు. ఎల్.ఎల్.బి ఐదవ సెమిస్టర్, ఐదు సంవత్సరాల(ఐ పి సి హెచ్)ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్ని సబ్జెక్టులకు 600 రూపాయలు చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
