బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా కరాటే శిక్షణ తరగతులను నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కరాటే తరగతులు మూడు నెలల వరకు వారంలో మూడు రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుదర్శన్, అన్నపూర్ణ, శ్రీనివాస్, రవి, శంకర్, విజయ కుమారి గోదావరి, సుమతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.