బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థలో చేరుకున్నందున నూతన భవనాన్ని నిర్మించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం డిపో మేనేజర్ సరితా దేవికి భాజపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతమున్న బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థలో ఉందని దాన్ని కూల్చివేసి నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలని ఆర్టీసీ బస్టాండుకు ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బాన్సువాడ పట్టణ శివారులో మరో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని బాన్సువాడ ఆర్టీసీ డిఎంకు కోరడం జరిగింది.వెంటనే ఆర్టీసీ డిఎం స్పందించి బాన్సువాడ బస్టాండుకు మరమ్మతులు మరమ్మతులు చేపడుతున్నామని త్వరలో పూర్తి అవుతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు చీకటి రాజు పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ పాశం భాస్కర్ రెడ్డి కొండని గంగారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
