ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా
ఎల్లారెడ్డి, బతుకమ్మ : వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధి ని ఓర్వలేక తప్పడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ పెద్దోడ్ల నర్సింలుకు సంబంధించిన ఇంటి కూల్చివేతకు, ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు నర్సింలు ఇల్లు కూల్చివేత పై మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. పెద్దోడ్ల నర్సింలు కబ్జా స్థలంలో నివాసం ఏర్పాటు చేయడంతో సంబంధిత అధికారులు అనేకమార్లు నోటీసులు ఇచ్చి కూల్చి వేశారని పేర్కొన్నారు. పెద్దోడ్ల నర్సింలు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పీటీసీ సామెల్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, తిరుపతి, అజార్, ఆశమొల్ల సాయిబాబు, వహీద్, సంతోష్ నాయక్, నీల రవి, సుకెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
