రుద్రూర్, బతుకమ్మ :
ఫిట్స్ వచ్చి రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని ఉద్మీర్ గల్లీకి చెందిన మాసుల్ సంజీవ్ కుమార్ (44) అను వ్యక్తి గత ఏడు సంవత్సరాలుగా మానసికంగా బాగాలేదని, ఈ నెల 1 వ తేది బుధవారం రోజున ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదన్నారు. గురువారం ఉదయం రుద్రూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే రహదారిలో ఫిట్స్ వచ్చి బోర్ల పడి చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య మాసుల్ అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
