నిజామాబాద సిటీ, బతుకమ్మ : కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్ 100% ఉత్తీర్ణత శాతం సాధించిందని ప్రిన్సిపల్ తెలిపారు. డి. హశ్వంత్ 96.40% సాధించి మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. బి. సాయి సుశ్రుత 96% సాధించి రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. పది మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ సాధించారని అన్నారు. కృత్రిమ మేధస్సు విషయంలో 4 మంది విద్యార్థులు పరిపూర్ణ స్కోరు సాధించారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అసాధారణ కృషి కారణంగా ఈ ఫలితం సాధ్యమైందన్నారు.
