. . . జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్
బిచ్కుంద, బతుకమ్మ :
లోక్ అదాలత్ అనేది ప్రజల న్యాయస్థానం అని, ఇరువర్గాల కక్షీదారులు సామరస్యంతో రాజీ కుదుర్చుకునే ఒక వేదిక అని జూనియర్ సివిల్ కోర్టు బిచ్కుంద నందు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్ అన్నారు. శనివారం బిచ్కుంద పట్టణంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్ జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించి ప్రసంగించారు. న్యాయస్థానం లో పెండింగ్ లో ఉన్న లేదా వ్యాజ్యానికి ముందు దశలో స్నేహపూర్వక పద్ధతిలో రాజీ కుదుర్చుకునే పరిష్కరించే ఒక వేదిక అని, ఈ వేదిక పై రాజీ చేసుకని పరిష్కరించుకుంటే జడ్జిమెంట్ తో సమానమైనదని, మళ్ళీ అప్పీలు ఉండదని ఆయన అన్నారు. గతంలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నిర్వహించే లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అవుతున్నందున ప్రజలు ఈ అదాలత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోక్ అదాలత్ వ్యవస్థ భారతదేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో అత్యంత సమర్థవంతమైనదిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మోటారు ప్రమాద క్లెయిమ్స్, సివిల్, బ్యాంకు రుణాలు, చెక్కు బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాల వంటి అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి అన్నారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది లక్ష్మణ్ రావు మరియు కోర్టు సిబ్బంది ఉన్నారు.