25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  • 6వ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ మోసగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నగరంలోని ఆరో టౌన్ ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన  పోలీస్ స్టేషన్ మొత్తం కలియతిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకు న్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

People should be alerted about cyber frauds

సూచించారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు.  దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.  గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.  ఆయన వెంట సౌత్ రూరల్ సీఐ ఎన్.సురేష్ కుమార్, 6వ టౌన్ ఎస్ఐ  కె. వెంకట్ రావ్, సిబ్బంది  పాల్గొన్నారు.

People should be alerted about cyber frauds

More articles

Latest article