- తనిఖీ కోసం వెళ్లిన పోలీసులపై కర్రలతో దాడి
బీహార్, బతుకమ్మ : బీహార్లోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై ప్రజలు దాడి చేశారు. పదుల సంఖ్యలో ప్రజలు కర్రలతో కొట్టి, ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఓ మహిళ ఎస్ఐ ‘మమ్మీ-మమ్మీ’ అని ఏడ్చినట్లు వీడియోలో ఉంది. తమను వదిలేయాలని పోలీసు సిబ్బంది చేతులు జోడించి వేడుకున్నారు.
