దయానంద రెడ్డి దయా హృదయుడు

0 14,542
  • మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

 

బాల్కొండ, బతుకమ్మ:దయానంద్ రెడ్డి సేవలు అభినందనీయమని ఆయన దయా హృదయుడని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రం పాండురంగ ఫంక్షన్ హాల్లో జరిగిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి సహకారంతో ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని సుమారు 40 పాఠశాలలకు సుమారు 20 లక్షల రూపాయలతో కూడిన స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ దుస్తుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఏనుగు దయానంద్ రెడ్డి తాను చేసే దానాల గురించి పెద్దగా ప్రచారం చేసుకోని గొప్ప మనసు అయనది ప్రభుత్వ పాఠశాల లో చదువుతూ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి దయానంద్ రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగిన ఎప్పుడు వారి గ్రామీణ  మూలలను మరిచిపోలేదు. గతంలో ప్రభుత్వ పాఠశాల లో తాను చదువుకున్నప్పుడు పడిన ఇబ్బందులు గుర్తు ఎరిగి ప్రస్తుత విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రవేట్ స్కూల్  విద్యార్థులతో పోటీ పడేలా అనేక పాఠశాల లో మౌలిక వసతులు కల్పించాలని తలంచి కొట్లాది రూపాయలతో కంప్యూటర్ లు, సైన్స్ ల్యాబ్, డెస్క్ బెంచ్ లు, స్పోర్ట్స్ మెటీరియల్ డ్రెస్  లను అందజేశారు. దయానంద్ రెడ్డి ని స్ఫూర్తి గా తీసుకొని ఇంకొందరు కుడా ప్రభుత్వ పాఠశాల లకు సహాయం చేయడానికి ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యను.దయానంద్ రెడ్డి చేస్తున్న సహాయాన్ని మధ్యలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా విద్యార్థులకు చేరడంలో pd రాజకుమార్ కృషి చేస్తున్నారు వారికీ అభినందనలు రాజకీయాల్లోకి వచ్చి చెడిపోతున్నామా అని భావన వస్తున్న సమయంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా దయానంద్ రెడ్డి  నిస్వార్తంగా సేవ చేస్తున్నారు. దయానంద్ రెడ్డి చిట్టపూర్ గ్రామంలో ప్రైమరి స్కూల్ దత్తత తీసుకొని పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ఆటో లకు నెలకు 18000 చెల్లీస్తున్నారు. ఒక చదువులోనే కాకుండా క్రీడా పోటీలలో కుడా విద్యార్థులు రానించాలని సుమారు 20 లక్షల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్ ఉమ్మడి నిజామాబాద్ లో 40 పాఠశాల లకు దయానంద్ రెడ్డి సహకారంతో  అందజేయడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గం లో  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కింది 25 పాఠశాల లకు మెటీరియల్ అందజేశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుండటంతో పాఠశాల లకు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మెటీరియల్ అందజేస్తున్నారు.

Dayananda Reddy has a kind heart

Leave A Reply

Your email address will not be published.