. . . సీపీఐఎంఎల్ ఎన్ డి డివిజన్ నాయకులు వాసరి సాయినాథ్
డిచ్ పల్లి, బతుకమ్మ :
ఫించన్ దారులకు వెంటనే వారి ఫించన్ ను అందజేయాలని, లేదంటే సీపీఐ ఎంఎల్ ఎన్ డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐఎంఎల్ ఎన్ డి డివిజన్ నాయకులు వాసరి సాయినాథ్ అన్నారు. వితంతు, వికలాంగుల, బీడీ కార్మికులు, వృధాప్య పింఛన్ డబ్బులు ప్రభుత్వం డిపాజిట్ చేసినా పోస్ట్ ఆఫీస్ వారు ఫించన్ దారులకు ఇవ్వడం లేదని డిచ్ పల్లి పోస్ట్ ఆఫీస్ ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఏప్రల్ 24న డౌన్లోడ్ చేసిందని, డౌన్లోడ్ చేసి 15 రోజలు గడుస్తున్న ఇప్పటి వరకు ఫించన్ దారులకు ఆ డబ్బులు అందజేయలేదని అన్నారు. ఈ రోజైనా ఇవ్వమని అడిగితే ఇంకా 10 రోజుల సమయం పడుతుందని అంటున్నారని వాపోయారు. ఈ ఫించన్ పైన ఆధార పడి జీవన్ సాగించే వారు చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫించన్ దారులందరికి వెంటనే ఫించన్ డబ్బలు అందజేయాలని, లేదంటే డిచ్ పల్లి, ఇందల్ వాయి, ధర్పల్లి మండలాల్లో ఉన్న ఫించన్ దారులకు తీసుకుని ఆర్మూర్ మెయిన్ బ్రాంచ్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, బుచ్చక్క, లక్ష్మి, భాగ్య, పోసాని సాయిలు, భరత్, సాయమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
