- భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి విఠల్
కామారెడ్డి, బతుకమ్మ: జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కేటాయించడంలో లేదని భారత విద్యార్థి మోర్చ నాయకులు అన్నారు. మంగళవారం భారత విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరల తరబడి విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల నుంచి ఫీజులు చెల్లించమని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా మంది తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వరకు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఏలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని అన్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ పైననే ఆధారపడి నడుపుతున్నారు. ఆ కళాశాలలో జీతాలు ఇవ్వలేక ఇటు విద్యార్థులకు న్యాయం చేయలేక విద్యా సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్న బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే భారత విద్యార్థి మోర్చ విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్బాస్ ఖాన్ ,ఇంచార్జ్ పెరుమాండ్ల బుల్లెట్,కార్యదర్శి శ్యామ్, నాయకులు కార్తిక్, శివ, ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.
