29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్, మాక్లూర్,మండల్ వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కిషన్ మాట్లాడుతూ  2016 సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పును వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ  తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారికి నాలుగు నెలల నుండి జీతాలు రాక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు ఓకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 60 ప్రకారం16,500  చెల్లిస్తుంటే గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం 9500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్  పెడుతున్నారు అన్నారు. దీనివల్ల  కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల జీతాలు చెల్లించుటకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించినా, పదవీ విరమణ  పొందినా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, గ్రామపంచాయతీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUCI జిల్లా నాయకులు సత్తెక్క, గజనాధ్, దశరథ్,దయాల్సింగ్,మజీద్, రాజేశ్వర్,దుర్గయ్య, నర్సయ్య. సువర్ణ, బజ్జన, గంగాధర్,చిన్నసాయన్న, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article