పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్, మాక్లూర్,మండల్ వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కిషన్ మాట్లాడుతూ  2016 సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పును వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ  తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల...