30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆడ పిల్లలను చదవనిద్దాం.. మహిళలను గౌరవిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మహిళల సాధికారతకు విద్య మూలస్తంభం. చదువుతోనే బాలికల ఉన్నతికి మార్గం సాధ్యమవుతుందనీ. ఆడ పిల్లల శ్రేయస్సు, వారి విద్య పట్ల ప్రాముఖ్యత ప్రతి తల్లి తండ్రి తెలుసుకుని ఆడ పిల్లలను(మహిళలను) గౌరవిద్దాం ఎదగనిద్దాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ తెలిపారు.

  • మార్చ్ 8న ప్రపంచ మహిళా దినోత్సవం

ప్రపంచ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ కస్తూరి కావేరి నీ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నేడు చాలా రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగిందని, పురుషుల కంటే మహిళలు ఏం తక్కువ కాదు అన్నట్లు అంతర్జాతీయ వేదికల మీద ఓలంపిక్ క్రీడలలో కూడా మహిళల ప్రాధాన్యత పెరిగిందని ఎన్నో పథకాలు తీసుకు వచ్చారని అన్నారు. చదువుల్లో, ఉద్యోగాలలో , వ్యాపార రంగాలలో , క్రీడలలో, అంతరిక్షంలో ఎక్కడైనా మహిళల పాత్ర లేనిది ఏది లేదని కొనియాడారు. అలాంటి ఆడపిల్లలను చిన్నతనం నుండి చదివించి, ఉన్న అవకాశాలను దక్కించుకునేల తల్లి తండ్రులు ఆడ పిల్లలను ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు. మండల మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article