పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్, మాక్లూర్,మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలలు పెండింగ్ జీతాలు వెంటనే చెలించాలని డిమాండ్ చేశారు. 2016 సంవత్సరంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆ తీర్పును వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారికి నాలుగు నెలల నుండి జీతాలు రాక అవస్థలు...