27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి
  • పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్

    నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  రాష్ట్రంలో గత మూడు ఏళ్ల నుండి రూ.6వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని పీ.డీ.యస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ని కోటగల్లీ ఎన్.ఆర్. భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గత 3ఏళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటికే చాలా రకాల ప్రవేశ పరీక్షలు పూర్తి అయ్యి ఉన్నత చదువులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒక్క ప్రక్కన విద్యార్థులు ఇబ్బందులు, మరోవైపు యాజమాన్యాలు అప్పులు, జీతాలు చెల్లించలేమని సోమవారం నుంచి కళాశాలల బంద్ కు పిలుపునివ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నష్టం లేకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని డిగ్రీ, పిజి కళాశాలలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులు ఉన్నారన్నారు. తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గించి విద్యను నిరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జిల్లా నాయకులు మహిపాల్, నాయకులు మమత, నజీర్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article