- ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కాలేజ్ ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందుల గురవుతున్నారన్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు మీరు ఇచ్చే బిక్ష కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నారు. విద్యార్థులు గోసలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ విడుదల చెయ్యాలని, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున అసెoబ్లీ గేట్లు బద్దలు కొడ్తామ్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ జోనల్ ఇంచార్జి దుర్గ దాస్, సన్నీ, సిద్దు, విగ్నేష్, టోనీ, కార్తీక్, విగ్నేష్, హరీష్, అక్లేష్, శశాంక్, రంజిత్,లక్కీ తదితరులు పాల్గొన్నారు.
