- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం
డిచ్ పల్లి, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం డిచ్పల్లి మండలంలోని ఎస్ పి ఆర్ జూనియర్ కళాశాలలో నవీన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిందని అన్నారు. 3 విద్యాసంవత్సరాల నిధులు మొత్తం పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు 8,300వేల కోట్ల పై ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంవత్సరం పూర్తి అయ్యాక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక పోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు నాన ఇబ్బందులు పడుతున్నారని అనేక కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని అనడంతో తల్లితండ్రులు అప్పులు చేసి మరీ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో రాగానే ఫీజు విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి అవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ఒకసారి సెటిల్మెంట్ రూపంలో ఫీజు బకాయిల విడుదల అని సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తే పరీక్షలు నిర్వహిస్తేనే విడుదల చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్న చలన్ల నిధులు అయిన విడుదల చేస్తే కొద్ది ఉపశమనం కలుగుతుంది అని తెలిపారు. అదే విధంగా బడ్జెట్ కళాశాలలు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటూ కిరాయిలు కట్టలేక, బోధన బోధనేతర సిబ్బంది కి సకాలంలో జీతాలు ఇవ్వలేనీ పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఓట్ల కోరకు రైతులకు రైతు భరోసా పైసలు ఇచ్చి విద్యార్థుల ఫేస్బుక్ విడుదల చేయకపోతే విద్యార్థులు తల్లిదండ్రుల ఓట్లు ఎలా పడతాయని? అన్నారు. ప్రజాప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అయిందని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సకాలంలో విడుదల చేయాలని, పది రోజుల్లో ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, జిల్లా నాయకులు నవీన్, కృష్ణ, మైపాల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అబ్దుల్, కుమార్, విజయ్, శశికాంత్, చరణ్ విక్రమ్, నితిన్, రావు జి, శివ ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
