25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కవిత బీసీ ధర్నా జోక్ : మంత్రి కోమటిరెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

సూర్యాపేట లిల్లీపుట్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడు

నల్గొండ, బతుకమ్మ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏముఖం పెట్టుకొని నిరాహార దీక్ష చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ల నాన్నతో మాట్లాడి రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. కవిత బీసీ ధర్నా జోక్ అని,  బీసీ రిజర్వేషన్‌ల కోసం కేంద్రంతో కొట్లాడతామని స్పష్టం చేశారు.. బనకచర్లపై అవసరమైతే కేంద్రంతో కొట్లాడి.. నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. సూర్యాపేట లిల్లీపుట్ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోతాడన్నారు.  పాలమూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేశారు కాబట్టే ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు.  జగన్ తో ఫ్రెండ్షిప్ కోసమే కేసీఆర్ దక్షిణ తెలంగాణను ఎండబెట్టాడని విమర్శించారు.

More articles

Latest article