24 C
Hyderabad
Sunday, August 2, 2026

పోచారం ప్రాజెక్టు వద్ద మొక్కలు నాటిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో పోచారం ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో హరిత హారం కార్యక్రమం భాగంగా 2000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈత, ఖజుర మొక్కలు ప్రధానంగా నాటబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సీఐ షకీర్ హైమద్, పోలీసు శాఖ ఏఎస్సై సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ స్వప్న, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు, గౌడ కులస్తులు యాదగిరి గౌడ్, స్కైలబ్ గౌడ్, అశోక్ గౌడ్, నర్సింలు గౌడ్ పాల్గొన్నారు.

Officials planted saplings at Pocharam project

More articles

Latest article