పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిచ్ పల్లి, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం డిచ్పల్లి మండలంలోని ఎస్ పి ఆర్ జూనియర్ కళాశాలలో నవీన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు...