పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలో శనివారం ఏబీవీపీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 8300 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ముఖ్యంగా చదువుకొనే పేద...