27.3 C
Hyderabad
Friday, July 31, 2026

నిజామాబాద్ లో శాంతియుత వాతావరణం కాపాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . శాంతి ర్యాలీలో మాజీ మేయర్ ధర్మపూరి సంజయ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

 

కొందరు వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. కులాలు మతాలు అంటూ రెచ్చగొడుతూ వారి ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైశ్యామ్యాలను రెచ్చగొట్టే  ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో పీస్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ అంటేనే మినీ భారతదేశం అని, అలాంటి ఈ జిల్లాలో కొందరు రాజకీయ పార్టీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయనన్నారు. తన తండ్రి డియస్ హయాంలో అన్ని కులాలు, మతాలను దగ్గరికి తీసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించే దిశగా కృషి చేసేవారని ఆయనన్నారు.

 

Peaceful atmosphere should be maintained in Nizamabad

 

కానీ ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయాల ప్రయోజనాల కోసం హిందూ ముస్లింలు సోదరులుగా పిలుచుకునే అప్పటి సంస్కృతిని ఇప్పుడు ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకులు రెచ్చగొడుతూ అల్లర్లకు ప్రోత్సహిస్తున్నారని ఇకనైనా వారి పద్ధతి మానుకోవాలని సూచించారు. నిజామాబాద్ అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మినీ ఇండియా గా తెలుసుకోబడే విధంగా ఆ రాజకీయ నాయకులకు తెలియ చెప్పే సమయం వచ్చిందన్నారు. అందుకే నేను ఈ అన్ని కులాలు మతాలు కుల సంఘాలతో కలిసి పీస్ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ కులాలు, మతాలకు చెందిన పెద్దలు ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Peaceful atmosphere should be maintained in Nizamabad

 

Peaceful atmosphere should be maintained in Nizamabad

 

More articles

Latest article