25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రూరల్ ఎమ్మెల్యే పిఏపై కలెక్టర్ కు పీ డీ ఎస్ యూ ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే పిఏ గా పనిచేస్తున్నారని వారి పైన  అధికారులు చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు పీఏలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేయొద్దని  విద్య హక్కు చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి పిఏగా పనిచేస్తున్నాడని, పిఏగా పనిచేయడానికి ప్రభుత్వం నుంచి  ప్రత్యేకంగా ఎటువంటి అనుమతి లేదని అన్నారు. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ పీఏ గా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. గతంలోనే సంబంధిత ఎంఈఓకు, డీఈవో కు విషయాన్ని చేరవేశామని అయిన గాని ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తూనే ఉపాధ్యాయులను పీఏ గా పెట్టుకోవడం సరైంది కాదని అన్నారు. వినతిపత్రానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వివరణ తీసుకొని తదుపరి చర్యలు మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు మనోజ్, నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, నాయకులు ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

PDSU complains to Collector against Rural MLA PA

More articles

Latest article