- సిసిఎస్, లోకల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
![https://batukammanews.com/pds-rice-threshing-in-rice-mill/]()
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్- మంచిర్యాల్ జాతీయ రహదారిపై మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పై పోలీసులు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు , మాక్లూరు పోలీసులు దాని నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం దాడి నిర్వహించి డీసీఎం నిండా ఉన్న పిడిఎఏస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు.

రైస్ మిల్లు లో పిడిఎస్ బియ్యం ఎక్కడివీ?
నిజామాబాద్ ఆర్మూర్ ప్రధాన రహదారిపై ఉన్న రైస్ మిల్లులో పట్టపగలు పిడిఎస్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది. పిడిఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కోసం రీసైకిలింగ్ చేసేందుకు తీసుకువచ్చారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పిడిఏస్ బియ్యాన్ని తీసుకువచ్చిన నలుగురు వ్యక్తులు మాత్రం గత కొన్ని రోజులుగా సంబంధిత మహాలక్ష్మి రైస్ మిల్ కు తాము రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని చెబుతున్నారు. అందులో భాగంగానే డీసీఎం లోడు బియ్యాన్ని తీసుకువచ్చినట్టు చెబుతున్నారు.

పిడిఎస్ మాఫియా బ్లాక్ మెయిల్ కోసమే లారీని నిలిపారా?
మహాలక్ష్మి రైస్ మిల్లులో పోలీసులు దాడి చేసే సమయానికి జిల్లా కేంద్రంలో పిడిఎస్ దందా నిర్వహించే నలుగురు సూత్రధారులు ఉన్నారు. డీసీఎం లారీ నిండా ఉన్న రేషన్ బియ్యం గుర్తించిన అధికారులు అక్కడ పిడిఎస్ మాఫియా సూత్రధారులు ఉండడాన్ని గమనించి వారిని విచారిస్తున్నారు. అయితే రైస్ మిల్ యజమాని మాత్రం తాను బియ్యం తీసుకోలేదని నలుగురు వ్యక్తులు లారీని తీసుకువచ్చి నిలిపి బియ్యాన్ని కొంటారా లేదా అని బ్లాక్ మెయిల్ చేశారని వారే పోలీసులకు సమాచారం అందించారని చెప్పడం విశేషం. 25 లక్షలు డిమాండ్ చేసిన పిడిఎస్ సూత్రధారులు అవి ఇవ్వకపోవడంతోని పోలీసులకు సమాచారం అందించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై అక్కడ ఉన్న సిసిఎస్ పోలీసులు, నార్త్ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ స్పందించలేదు.

