నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నగరంలోని కొజ్జా కాలనీలో బొలెరే వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో 75క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యం విలువ సుమారు. రూ.2.45లక్షలు ఉంటుందని తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.