26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అంతర్ రాష్ట్ర పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్టు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్టు అమలు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పార్థీ ముఠా సభ్యులైన క్రిష్ణ  బాబు షిండే అలియాస్ క్రిష్ణ కుమార్ షిండే, నాందేవ్ అలియాస్ రాం కిషన్ బోస్లే అలియాస్ రాందాస్, రాథోడ్ అజిత్ రమేశ్ అలియాస్ అజయ్ లపై పీడీ యాక్టు అమలు చేసినట్లు తెలిపారు. ఇదే ముఠాకు చెందిన మరో ప్రధాన నిందితుడు భాస్కర్ బాపురావ్ చవాన్ అలియాస్ భాస్కర్ దాదా రావ్ చవాన్ సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, పిట్లం, బీర్కూర్, మద్నూర్ పోలీస్ స్టేషన్లతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో 14 ప్రమాదకర దోపిడీ, చోరీ కేసుల్లో నేరాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ప్రస్తుతం అతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్టుల ఉత్తర్వులను సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి.సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పరాజ్, గాంధారి ఎస్ఐ ఆంజనేయలు, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్.నర్సింలు శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉత్తర్వులను నిందితులకు అందజేశారు. వారి నేరపూరిత చర్యలు సమాజంలో శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నందున ప్రజల రక్షణ కోసం పీడీ యాక్టు ప్రయోగించడం తప్పని సరైందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిందితులు ఒక సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలులోనే నిర్భందంలో ఉండే అవకాశం ఉందని తెలిపారు.

More articles

Latest article