వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు నిధులతో నిర్మించతలపెట్టిన భవన నిర్మాణం పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన స్వంత గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 2కోట్ల 20 లక్షల నిధులను మాజీ ఎం. పి సంతోష్ రావు తన రాజ్యసభ నిధుల నుండి అడగగానే మంజూరు ఇచ్చారని అందుకు గ్రామ ప్రజల తరపున, తన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల నుండి రూ. కోటి 3లక్షల నిధులు ఈ పాఠశాల అభివృద్ధికె కేటాయించడం జరిగిందన్నారు. మిగతా నిధుల గ్రామ అభివృద్ధికి గాను పలు పనులకు వినోయోగించడం జరిగిందన్నారు.
