27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగత ర్యాలీ జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

. . . హైడ్రా పై ప్రతిపక్షాలు డ్రామాలు

. . . పీసీసీ అధికార ప్రతినిధి వేణు గోపాల్ యాదవ్                                                                                                                                

బతుకమ్మ,మోర్తాడ్ :                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఈ నెల 4నతొలి సారి జిల్లాకు వస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన స్వాగత ర్యాలీని విజయవంతం చేయాలని పిసిసి అధికార ప్రతినిధి వేణు గోపాల్ యాదవ్ పిలుపు నిచ్చారు. బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో  ఆయన విలేకరుల సమావేశం మాట్లాడుతూ బిసి కమీషన్ ఇచ్చిన నివేదిక అదారంగానే బిసి కుల ఘనననునిర్వహించి బిసి కులగనన అదారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హైడ్రా పై ప్రతీ పక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని,హై డ్రా కేవలం నిబంధన లకు విరుద్ధం గా నిర్మించిన కట్టదాలను మాత్రమే కూల్చి వేస్తుందని దానివల్ల హైద్రాబాద్ సిటీకి వర్షకాలం లో వరద ప్రభావం నుండి జరిగే విపత్తు లను తప్పించు కోవచ్చని, ఇది మా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపిత నిర్ణయం అని ఇది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల వర్షాకాలం వరదల వల్ల సిటీ మొత్తం జలమయమవుతుందని  దానిని తప్పించేందుకేఈ హైడ్రా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మేము గత ప్రభుత్వం మాదిరిగా కాలేశ్వరం ఇతరత్ర  ప్రాజెక్ట్ పేరుతో దోచుకో వడం  లేదన్నారు. గత ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దాణం చేసినప్పటికీ సత్యాలను విషయంలో గత ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోయారు.మా ప్రభుత్వ చేసే సాహో సోపితే నిర్ణయాలకు రేవంత్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు రావడం చూసి ఓర్వలేక మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి విషయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. మేము గత ప్రభుత్వాల మాదిరి ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడం లేదని కేవలం హైదరాబాద్ అభివృద్ధి కోసమే ఇలాంటి సాహసోపిత నిర్ణయాలు తీసుకుంటున్నామని దానికి ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో డి సిసి వై స్ ప్రెసిడెంట్ శివాన్నోళ్ల శివకుమార్,మోర్తాడ్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాల రాములు, ఎర్గట్ల మండల్ ప్రెసిడెంట్ దేవారెడ్డి,వైశ్రీ, దేవేందర్, పడిగేల ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ మహిపాల్, పుప్పాల అశోక్, కుదురుపాక ప్రవీణ్, అనిల్, గంగా నర్సయ్య, సురేష్, సాయరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article