25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పెన్షన్ చెల్లింపులు 16 రూపాయలు మాయం

Must read

📰 Generate e-Paper Clip

 బిచ్కుంద, బతుకమ్మ :                                                                                                                                          

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పోస్టాఫీసులో ప్రతినెల ఇచ్చే పెన్షన్ లో 16 రూపాయలు ఇవ్వడం లేదంటూ పెన్షన్ తీసుకుంటున్న బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులకు, వితంతువులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 4,016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోస్టాఫీసులో విధులు నిర్వహించే ఔట్సోర్సింగ్ సిబ్బంది ఫించన్ లబ్ధిదారులకు 2,000, 4,000 రూపాయలు ఇచ్చి, చిల్లర 16 రూపాయలను తన జేబులో వేసుకుంటున్నారని పెన్షన్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో పోస్టాఫీస్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చిల్లర 16 రూపాయలను తన జేబులో నింపుకుంటున్నరాన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా లబ్దిదారుడు చిల్లర ఎందుకు ఇవ్వడం లేదని పోస్టు ఆఫీస్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిలదీస్తే చిల్లర డబ్బులు లేవని.. నీ దగ్గర చిల్లర డబ్బులు ఉంటే తీసుకుని రా.. లేకపోతే నేను ఇచ్చిన డబ్బులే తీసుకొని పోవాలంటున్నారాన్ని పింఛన్ లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదే విషయంపై బిచ్కుంద సబ్ పోస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ స్పందించాడు. గతంలో బిచ్కుంద పోస్ట్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది  చిల్లర 16 రూపాయలు ఇవ్వడం లేదని మా దృష్టికి వచ్చింది. వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో ఫించన్ లబ్ధిదారులకు చిల్లర 16 రూపాయలు ఇవ్వని పోస్టాఫీస్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

More articles

Latest article