25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అనన్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించండి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బారస నేతలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : మూడు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో కాలువలో పడి మృతి చెందిన రెండేళ్ల చిన్నారి అనన్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించాలని భారత రాష్ట్ర సమితి నగర అధ్యక్షులు సిర్ప రాజు డిమాండ్ చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని భారత రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ, కమిషనర్ మకరంద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, కార్య దర్శి ఎనుగందుల మురళీ, సత్యప్రకాశ్, విక్రం గౌడ్, పోల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article