పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ..

0 1,954

ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తారా?

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని, పవన్ జీవిత కాలంలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యార అని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన చరిత్ర చంద్రబాబుది మాత్రమేనని విమర్శించారు. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకుంటే ఎలా?.. అధికారంలో మీరే ఉంటారా?, ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తారా? అని జగన్ నిలదీశారు. రెండు బడ్జెట్లలోనూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదన్నారు. అధికార పక్షాన్ని చూస్తే పరనింద, ఆత్మసుత్తిలా ఉందన్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్దం, మోసం.. జగన్ చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నామని పోజులు ఇస్తున్నారన్నారు.. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారని గుర్తుచేశారు.. బడ్జెట్‌లో సూపర్ సిక్సర్ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని విమర్శించారు. మాత్రమే.. తొలి బడ్జెట్‌లో పథకాలకు కేటాయించింది బోడి సున్నా, మేనిఫెస్టో హామీలపై అడిగితే సమాధానం లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.