26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన పార్టీలకు సంపూర్ణ మద్దతు ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

. . . రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేయాలి…

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్థులకు అన్ని రాజకీయ పార్టీలు తమ టికెట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ద్రష్టిలో ఉంచుకుని సోమవారం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ జనరల్ స్థానాలు అంటే కొన్ని అగ్రవర్ణాల కులాలు వారి గుత్తాధిపత్యం అని అనుకుంటున్నారని, కానీ జనరల్ స్థానాల్లో కూడా బీసీలు ఐకమత్యాన్ని చాటి బీసీల సత్తా చూపెట్టడానికి సంయుక్తంగా ఉన్నారన్నారు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ జనరల్ స్థానాల్లో 50 శాతానికి మించి బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఇటీవలే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాదాపు 51 శాతం బీసీ అభ్యర్థులు జనరల్ స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ బిడ్డలు ఎంతోమంది పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇస్తే తామేంటో నిరూపిస్తారన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బలపరిచిన బీసీ అభ్యర్థులకు అన్ని పార్టీల టికెట్లు వస్తే ఆ బీసీ బిడ్డలకు కూడా బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు బుస్సా ఆంజనేయులు, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడా శంకర్, బగ్గలి అజయ్, శ్రీలత, చంద్రకాంత్, సాయి బసవ, కోడూరు స్వామి, బాలన్న, రేఖ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article