- కార్యదర్శి, కారోబార్ మధ్య సమన్వయ లోపం
- గ్రామ సభలో గంధరగోళం
- కారోబార్ కి అండగా నిలిచిన యూనియన్ సభ్యులు
బతుకమ్మ, కోటగిరి : ఇంటి పంచాయితీ వీధిన పడినట్టుగా హంగార్గ గ్రామ పంచాయతీ తీరు మారింది. పోతంగల్ మండలం హంగార్గ గ్రామ పంచాయతీ లో పంచాయతీ కార్యదర్శికి, కారోబార్ కి మధ్య కొన్ని రోజుల నుంచి సమన్వయ లోపం కారణంగా వారి ఇద్దరి పంచాయతీ గ్రామ సభ రూపంలో రచ్చకెక్కింది. గత 30 ఏళ్లుగా గ్రామపంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్న హన్మాండ్లు అనే వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి విధుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తుండని ఆకారణంగా కారోబార్ గా పని చేస్తున్న వ్యక్తిని ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం పై కారోబార్ యూనియన్ సభ్యులు ఎంపిడిఓ చందర్ ను దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా రాత్రికి రాత్రే సదరు పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ పేరిట దండోర వేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఎంపీడీవో చందర్ సమక్షంలో గ్రామ సభ నిర్వహించగా అసలు బాగోతం బయట పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఇంటి పన్నుల విషయంలో పంచాయతీ కార్యదర్శికి, కారోబార్ మధ్య సమన్వయం లోపించింది. కొన్ని ఇండ్లకు డబుల్ బెడ్ ఇండ్ల నంబర్లు ఇచ్చి మరి కొందరికి ఇంటి నెంబర్ లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నెంబర్ ఇచ్చిన కొద్ది పాటి ఇండ్లకు అధిక పన్నులు ఎందుకు వసూల్ చేశారని వచ్చిన పన్నులను ఎక్కడిఎక్కడ ఖర్చు చేశారు అని గ్రామస్తులు ప్రశ్నించడంతో సభ గందరగోళంగా మారింది.30 ఏళ్లుగా పని చేస్తున్న వ్యక్తిని ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగించే ప్రయత్నం చేస్తారని యూనియన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.




