పంచముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ది కోసం కృషి చేస్తా

0 9,876

 

. . . మున్నూరు కాపులను ఒక్క తాటి పైకి తెచ్చేలా ప్రణాళికలు

 

. . . మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పంచముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, మీలో ఉన్న ఐక్యత అన్ని సంఘాలలో రావాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరిని ఏకం చేసి, ఒకే తాటిపైకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆదివారం వినాయక్ నగర్ లో గల పంచముఖి మున్నూరు కాపు సంఘం 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సంఘ భవనంలో నూతన అధ్యక్షులు మిద్దె రవికుమార్, ప్రధాన కార్యదర్శి దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ విచ్చేసి నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిలతో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కండువా, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ ను పంచముఖి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పంచముఖి సంఘ అభివృద్ధి కి తోడ్పాటునందించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్నూరు కాపుల ఐక్యత వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని, ఈ సంఘం బలోపేతం కోసం తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారన్నారు. సంఘాలకు భవనాలతో పాటు సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలిచారని, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తాను ధర్మపురి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ సంఘం బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానన్నారు. ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జడ్పిటిసిల ఎన్నికల్లో కాపు అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తామని గుర్తు చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. నూతన అధ్యక్షులు మిద్దె రవికుమార్ మాట్లాడుతూ అధ్యక్షులుగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ రెండు సంవత్సరాల కాల పరిమితిలో సంఘం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో పని చేస్తానన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు సేవ చేస్తానన్నారు. కోశాధికారి మాట్లాడుతూ సంఘంలో సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అందరి సహాయ సహకారాలతో సంఘం కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలికిషన్, గడ్కోల్ శ్రీనివాస్, రాజు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.