నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డిఎం పవర్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో నిజామాబాద్ ఇందూర్ క్లబ్ కు చెందిన జిల్కార్ విజయానంద్ కు ఉత్తమ జోన్ చైర్మన్ అవార్డ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ మెడల్ ను 2024-25 డిస్ట్రిక్ట్ గవర్నర్ నగేష్ పంపాటి అందచేశారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో వారి జోన్ పరిధిలోని ఇందూర్, కామారెడ్డి, కామారెడ్డి వివేకానంద, సదాశివనగర్ క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా లయన్ విజయానంద్ తనకు అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ జోన్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఘట్టమనేని బాబురావు, విశిష్ట అతిథి సూర్యరాజ్ 2025-26 గవర్నర్ అమర్నాథ్ రావు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరసింహ రాజు, ప్రవీణ్ మర్రి, శ్రీధర్, మధు, డిస్ట్రిక్ట్ 320డికి చెందిన పూర్వ గవర్నర్లు, లయన్ అధికారులు, వివిధ క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

