30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు వాసవి మాతాకు పంచామృతాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

  • కుంకుమార్చన, ప్రత్యేక పూజలు

 

భీమ్ గల్, బతుకమ్మ : శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ వాసవి మాత ఆలయంలో శుక్రవారం పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు భీమ్ గల్ శ్రీవాసవి   ఆర్య, వైశ్య సంఘ ప్రతినిధులు లాభిషేట్టి సురేష్, గరిపెల్లి సుదర్శన్ లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి,సుహాసినిలచే కుంకుమార్చన, మంగళ హారతి కార్యక్రమంను నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం తో పాటు అల్పాహర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యక్రమానికి సంఘ మహిళా సభ్యులు విధిగా మంగళ హరతులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ వారు కోరారు.

More articles

Latest article